Monday, November 14, 2011

ఆత్మహత్య అనేది మహా నేరం.....

 ఆత్మహత్య  అనేది మహా నేరం.....



ఆత్మహత్య అనే పదం అంటేనే నాకు చాల బయం.... ఎందుకు  ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తుంది.... కష్టం వచ్చిన ప్రతి వ్యక్తీ చనిపోవడాని సిద్దపడితే ఈక  లోకములో వుండేది ఎవరు .......
చావు ఒకటే అన్ని సమస్యలకి పరిష్కారం కాదు కదా.. నన్ను అడిగితే చనిపోయే అంత ధైర్యం వున్నవాడు బ్రతికి దేన్నీ ఐన సాధించగలడు....
పుట్టుక మన చేతిలో లేదు కదా మరి చనిపోవడం మన చేతిలో ఎందుకు వుంటుంది చెప్పండి.... పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు కానీ ఆత్మహత్య చేసుకొని ఎందుకు చనిపోవాలి మనం వద్దు అన్న మన దగ్గరికి చావు రాకుండా వుండదు కదా ఆ టైం వొచ్చిన రోజు నాకు ఒక నిముషం టైం ఇవ్వు అని బ్రతిమిలడిన ఒక సెకండ్ కూడా ప్రాణం ఆగదు కదా ... మన పుట్టుకకి ఏదో  అర్ధం వుండే వుంటుంది అది ఏంటి
అని తెలుసుకునే ప్రయత్నం చేయండి .....
నాకు అన్పిస్తుంది పెళ్లి పిల్లలు ఈవి మాత్రమే లైఫ్ కాదు లైఫ్ అంటే ఇంక ఏదో వుంది కదా... అది ఏంటో తెలుసుకోవాలి ...నేను ఆది తెలుసు కోవాలనే అన్వేషణలో వున్నాను....

No comments: